బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు వెంకయ్యనాయుడు, లగడపాటి రాజగోపాల్ సహా ప్రముఖులు హాజరు
- ఆదివారం ఉదయం జనని, సూర్యతేజ నిశ్చితార్థ వేడుక
- రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, శ్రీను వైట్ల తదితర సినీ ప్రముఖులు హాజరు
- వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ, సినీ ప్రముఖులు
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరగనుంది. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, శివాజీ, కోన వెంకట్, సి. కల్యాణ్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు విచ్చేశారు.