మూడేళ్లలో మద్యాన్ని రాష్ట్రం నుంచి వెలివేయడమే మా లక్ష్యం: మంత్రి నారాయణస్వామి
- అనర్థాలకు కారణం మద్యమేనన్న మంత్రి
- 43 వేల బెల్టు షాపులు తొలగించినట్టు వెల్లడి
- మద్యాన్ని ఆదాయవనరుగా చూడడంలేదని స్పష్టీకరణ
మూడేళ్లలో మద్యాన్ని రాష్ట్రం నుంచి వెలివేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మద్యం అక్రమరవాణా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వం మద్యాన్ని ఓ ఆదాయ వనరుగా చూడడంలేదని మంత్రి ఉద్ఘాటించారు. మద్య నిషేధానికి తూట్లు పొడిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.