వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ... అప్పట్లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు!
- చంద్రబాబు అక్రమాస్తులు కలిగివున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపణ
- 2005లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు
- హైకోర్టులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు
ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా, తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటివరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.