'వెంకీమామ'పై ప్రత్యేక దృష్టి పెట్టిన సురేశ్ బాబు

  • విడుదలకి ముస్తాబవుతున్న 'వెంకీమామ'
  • ప్రచారం నిమిత్తం భారీ ఖర్చు 
  • త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
వెంకటేశ్ - నాగచైతన్య కథానాయకులుగా, పాయల్ - రాశి ఖన్నా నాయికలుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' రూపొందింది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ విషయాన్ని నిన్ననే అధికారికంగా ప్రకటించారు. చాలాకాలం తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న పెద్ద సినిమా ఇది. పెద్ద పండుగ రోజున .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా ఇది.

అందువలన తమ బ్యానర్ కి తగినట్టుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సురేశ్ బాబు ఉన్నారట. ఈ సినిమా నుంచి వరుసగా పోస్టర్లు .. సాంగ్స్ వదిలేలా ఆయన ప్లాన్ చేశాడని చెబుతున్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. రిలీజ్ సమయానికి మంచి హైప్ వచ్చేలా ప్రచారానికిగాను భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు.
Go Back to Shorts
Venkatesh
Chaitu
Payal
Rasi Khanna

More Telugu News