తమిళనాడులో ఘోరం.. వర్షాల కారణంగా కూలిన నాలుగు భవనాలు.. 15 మంది మృతి
- కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో ఘటన
- భారీ వర్షాల కారణంగా కూలిన ఇళ్లు
- శిథిలాల కింద మరికొందరు
మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.