ఓపెనర్ గా రాహుల్ దిగుతాడని భావిస్తున్నాను: వీవీఎస్ లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓపెనర్ గా రాహుల్ దిగుతాడని భావిస్తున్నాను: వీవీఎస్ లక్ష్మణ్

  • వెస్టిండీస్ తో త్వరలో సిరీస్
  • మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ పై లక్ష్మణ్ స్పందన
  • రాహుల్‌ మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడని వ్యాఖ్య
  • శ్రేయస్‌ అయ్యర్‌ పై ప్రశంసల వర్షం
వెస్టిండీస్ తో టీమిండియా ఆడనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ పై భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా సారథి కోహ్లీ తిరిగి జట్టులో చేరాడని చెప్పారు. జట్టులో బ్యాట్స్ మెన్ రాహుల్‌ మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడని, త్వరలో జరగనున్న విండీస్‌ సిరీస్‌లో అతడు ఏ స్థానంలో ఆడతాడనేదే ప్రశ్నగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సారి అతడు రోహిత్‌శర్మతో కలిసి ఓపెనింగ్‌ లో దిగుతాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్‌ అయ్యర్‌  ఆడుతోన్న ఆట తీరుకు తాను మంత్ర ముగ్ధుడినయ్యానని లక్ష్మణ్‌ తెలిపారు. ఇటీవల బంగ్లాతో జరిగిన చివరి టీ20లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. టీమిండియా టాప్ ఆర్డర్ ను కోల్పోయి కష్టాల్లో పడిన సందర్భంలో పరిస్థితులను అర్థం చేసుకునే అతడు ఆడుతున్నాడని చెప్పారు. ఇటీవల అతడు పరిస్థితులకు తగ్గట్లు ఆడాడని చెప్పారు. టీమిండియాలో నాలుగో స్థానంలో అలాంటి ఆటే మనకు కావాలని ఆయన కొనియాడారు. 
vvs laxman
Cricket
rahul

More Telugu News