'అబద్ధాలు నిజమయ్యేలా ఉన్నాయి... అందుకే మాట్లాడుతున్నా': 'అనుష్క - ఓ సెలక్టర్' పుకార్లపై విరాట్ కోహ్లీ!
- ఓ సెలక్టర్ టీ ఇచ్చాడని ఫరూఖ్ ఇంజనీర్ వ్యాఖ్యలు
- సెలబ్రిటీ కావడంతో అనుష్క ప్రతి ఒక్కరికీ టార్గెట్
- 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో కోహ్లీ
దీనిపై 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ, శ్రీలంకతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన తన భార్య ఆమె సెలక్టర్ల బాక్స్ లో కూర్చోలేదని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్స్ లో కూర్చుందని అన్నాడు. ఆమె పక్కన ఏ సెలక్టర్ లేడని చెప్పాడు. అనుష్క పేరును వివాదాల్లోకి లాగి కొందరు లబ్దిని పొందుతున్నారని ఆరోపించాడు.