వేడుకగా సాగిన హీరో కృష్ణ మేనల్లుడి వివాహ రిసెప్షన్!

  • కృష్ణ ద్వితీయ సోదరి కుమారుడు శివసాయి
  • ఇటీవల సాయి అశ్రితతో వివాహం
  • రిసెప్షన్ కు హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
హీరో కృష్ణ మేనల్లుడు వినాయక శివసాయి వివాహ రిసెప్షన్ వేడుకగా సాగింది. కృష్ణ ద్వితీయ సోదరి ఉప్పలపాటి లక్ష్మీతులసి, నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ కుమారుడైన శివసాయి వివాహం, ఇటీవల కొల్లి వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమార్తె సాయి అశ్రితతో ఘనంగా జరుగగా, రిసెప్షన్ ను గోల్కొండ రిసార్ట్స్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన తాజా చిత్రం షూటింగ్ సాగుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన భార్య నమ్రత, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మంజుల, కేఎస్ రామారావు, బుద్ధా వెంకన్న, గద్దె రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.

Krishna
Sivasai
Reception
Golkonda Resort

More Telugu News