నేను తీసిన సినిమాలన్నీ 100 రోజులు పూర్తిచేసుకున్నాయి: నటుడు శివకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తీసిన సినిమాలన్నీ 100 రోజులు పూర్తిచేసుకున్నాయి: నటుడు శివకృష్ణ

  • నిర్మాతగానే నేను ఇండస్ట్రీకి వచ్చాను 
  •  కథకి నేను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను
  • నేను హీరోనని అనుకునేవాడిని కాదన్న శివకృష్ణ  
నటుడిగా .. నిర్మాతగా శివకృష్ణ సక్సెస్ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు సాగిన తన కెరియర్లో గుర్తుండిపోయే పాత్రలను చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమా నిర్మాణం అంటేనే ఎక్కువ ఇష్టం. నిర్మాతగా వచ్చిన నేను ఆర్టిస్టును అయ్యాను.

కథా కథనాలపై నాకు మంచి పట్టు వుంది. అందువలన నేను తీసిన సినిమాలన్నీ 100 రోజులను పూర్తిచేసుకున్నాయి. ఇది నా సొంత సినిమా .. నేను హీరోని .. కథ నా చుట్టూనే తిరగాలి .. నా వైపు నుంచే టైటిల్ ఉండాలి .. అని నేను ఎప్పుడూ అనుకునేవాడిని కాదు. కథనే అసలు హీరో అని నమ్మేవాడిని నేను. కథలో హీరో ఒక భాగమని మాత్రమే భావిస్తుంటాను. నా సినిమాల కథలన్నీ అలా ఉండేలా చూసుకునేవాడిని. అందువల్లనే ఆ సినిమాలన్నీ 100 రోజులను పూర్తిచేసుకున్నాయి" అని చెప్పుకొచ్చారు.
ShivaKrishna

More Telugu News