పిచ్చికి కూడా ఓ హద్దుంటుంది... జగన్ పిచ్చికి మాత్రం లేదు: నారా లోకేశ్

  • నాగార్జున వర్శిటీలో వైఎస్ఆర్ విగ్రహం
  • ఇది అధికార దుర్వినియోగమే
  • ట్విట్టర్ లో నారా లోకేశ్
గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ప్రతి పిచ్చికీ ఓ పద్ధతుంటుంది. కానీ, జగన్ పిచ్చిన మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదు. నాగార్జునా విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. స్వీయ స్తుతికి అధికారాన్ని వాడుతున్నారు" అని లోకేశ్ మండిపడ్డారు.
Go Back to Shorts
Nara Lokesh
Nagarjuna Univesity
Jagan
Twitter

More Telugu News