'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!

Gayapadda Simham Movie Update
  • రేపు విడుదలవుతున్న సినిమా
  • కామెడీతో మెప్పించే కంటెంట్ 
  • నాయికలుగా ఫరియా - మానస చౌదరి  
  • కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి

తరుణ్ భాస్కర్ .. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దర్శకుడిగా చిన్నచిన్న సినిమాలు చేస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తరువాత దర్శకుడిగా స్పీడ్ తగ్గించిన ఆయన, నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథానాయకుడిగా దూకుడు పెంచుతూ వెళుతున్నాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'గాయపడ్డ సింహం'. కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లలో దిగిపోనుంది.

తరుణ్ భాస్కర్ ఈ సారి పూర్తిస్థాయి కామెడీ కంటెంట్ తో చేసిన సినిమా ఇది. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా నాన్ స్టాప్ కామెడీతో నవ్విస్తుందని అంటున్నారు. కొన్ని హిట్ సినిమాల స్ఫూఫ్ లు పగలబడి నవ్విస్తాయని అంటున్నారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి .. పోకిరి .. బొమ్మరిల్లు సినిమాలలోని స్పూఫ్ లు తలచుకుని మరీ నవ్వుకునేలా చేస్తాయని చెబుతున్నారు. అలాగే కన్నడ హిట్స్ లోని స్పూఫ్ లు కూడా హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 

తరుణ్ భాస్కర్ సరసన నాయికలుగా ఫరియా అబ్దుల్లా .. మానస చౌదరి అలరించనున్నారు. ఈ ఇద్దరి భామలు కూడా నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలనే ఈ సినిమాలో చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా తమకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ పాత్ర చాలా రోజుల పాటు గుర్తుండిపోతుందని చెబుతున్నారు. ఇక శ్రీవిష్ణు అతిథి పాత్రలో సందడి చేయనుండటం మరో విశేషం.      

Advertisement
-

More Telugu News