Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ

  • ఫిలింనగర్ లో విజయ్ కొత్త నివాసం
  • భారీ మొత్తం చెల్లించిన విజయ్!
  • నేడే గృహప్రవేశం!
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండ పేరు ఓ బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. అసలు విషయానికొస్తే, విజయ్ కొత్త ఇంట్లో చేరాడు. హైదరాబాద్ ఫిలింనగర్ లో హీరో శ్రీకాంత్ ఇంటికి దగ్గర్లో ఓ విశాలమైన బంగ్లాను విజయ్ కొనుగోలు చేశాడు. ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. తన కొత్త నివాసం కోసం విజయ్ భారీ మొత్తం చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది.
Vijay Devarakonda
Tollywood
Filmnagar
Hero Srikanth
New Home

More Telugu News