మీది బీజేపీయా? 'బాబు జనాల పార్టీ'యా?: సుజనా చౌదరిని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి

  • వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీవైపు చూస్తున్నారన్న సుజనా
  • సుజనా సంగతి తెలిసిపోయింది
  • ట్విట్టర్ వేదికగా విజయసాయి సెటైర్లు
కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపి) వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ (బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది" అని ఆయన సెటైర్ వేశారు. కాగా, సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం బీజేపీవైపే చూస్తున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సుజనా చౌదరి అన్నారు. 
Go Back to Shorts
Sujana Chowdary
Vijay Sai Reddy
Twitter

More Telugu News