ఇదేంటి... పెద్ద హాకీ బాల్ లాగా ఉంది: పింక్ బంతిపై కోహ్లీ వ్యాఖ్యలు
- రేపటి నుంచి భారత్-బంగ్లాదేశ్ డేనైట్ టెస్టు
- మ్యాచ్ కోసం పింక్ బాల్ తో ప్రాక్టీసు చేసిన టీమిండియా
- పింక్ బంతితో ఫీల్డర్లకు తిప్పలు తప్పవంటున్న కోహ్లీ
బంతి ఉపరితలం మీద అదనపు పైపూత కారణంగా దీనికి అధిక దృఢత్వం వచ్చిందని, వికెట్ కీపర్ కు విసిరే త్రోల విషయంలో ఎరుపు రంగు బంతికంటే దీన్ని విసిరేందుకు అదనపు శక్తి ఉపయోగించక తప్పదని అభిప్రాయపడ్డాడు. గాల్లో మరింత ఎత్తుకు లేచే క్యాచ్ లను పట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అరచేతులు దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నాడు.