mumbai: ముంబై, చత్తీస్‌గఢ్‌లలో బాలికలపై సామూహిక అత్యాచారాలు

ముంబై, చత్తీస్‌గఢ్‌లలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని నాలాసొపొరా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ముగ్గురు యువకులు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆటోలో ఓ పాడుబడిన భవంతికి తీసుకెళ్లి మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు.

చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో 14 ఏళ్ల గిరిజన బాలికపై పాఠశాల వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పిక్నిక్ పేరుతో బాలికను తీసుకెళ్లిన డ్రైవర్, మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు ఘటనల్లోనూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
mumbai
Chhattisgarh
gang rape

More Telugu News