ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పెలా అవుతుంది?: హైకోర్టు
- సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
- ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని వెల్లడి
అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.