ఇందిరా గాంధీని 'ఐరన్ లేడీ' అంటూ కొనియాడిన రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇందిరా గాంధీని 'ఐరన్ లేడీ' అంటూ కొనియాడిన రాహుల్ గాంధీ

  • మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా  ప్రముఖుల నివాళులు
  • 'శక్తిస్థల్' ను సందర్శిస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేతలు
  • ఇందిర సమర్థవంతమైన నాయకురాలన్న రాహుల్
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులు అర్పించి ఆమె దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... ఇందిరా గాంధీకి నివాళులర్పించి ఆమె ఓ గొప్ప నాయకురాలని అన్నారు. ఆమె శక్తిమంతమైన, సమర్థమైన నాయకురాలని భారత్ ను దృఢమైన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఐరన్ లేడీ అని ట్వీట్ చేశారు. తమ ప్రియతమ నానమ్మ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నానని చెప్పారు.

కాగా, ఢిల్లీలో ఆమె సమాధి ఉన్న శక్తిస్థల్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు దర్శిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు ఆమె సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు.
Rahul Gandhi
Sonia Gandhi
Congress

More Telugu News