హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్.. పోలీసులకు ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్.. పోలీసులకు ఫిర్యాదు

  • గుర్తించిన శ్రీనాథ్ అనే వ్యక్తి
  • పెట్రోల్ బంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • కూకట్ పల్లిలోని హెచ్ పీ పెట్రోల్ నిర్వాహకులపై ఫిర్యాదు
వాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. కల్తీ పెట్రోల్ పోసి పంపించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి పెట్రోల్ బంకు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారంటూ శ్రీనాథ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూకట్ పల్లిలోని హెచ్ పీ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లగా కల్తీ పెట్రోల్ పోశారని శ్రీనాథ్ వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. వినియోగదారులతో ఆ పెట్రోల్ బంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

pertrol
Hyderabad
Police

More Telugu News