నటికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన జూనియర్ ఆర్టిస్ట్!

  • పలు షోలు కలిసి చేసిన యువతీ, యువకులు
  • పార్టీ ఉందని పిలిచి అత్యాచారం
  • పోలీసు కేసు నమోదు
పలు రియాల్టీ షోలతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఓ నటి, తనకు డ్రగ్స్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే, హర్యానాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్, ఓ టీవీ నటి కలిసి గతంలో పలు రియాల్టీ ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో గత నెల 13న పార్టీ ఉందని చెబితే, నటి ఓ హోటల్ కు వెళ్లింది. ఆపై ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్, ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం తాను గర్భవతినని, పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించి, మొహం చాటేశాడని ఆరోపిస్తూ, నటి పోలీసులను ఆశ్రయించింది. అతని తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పానని, వాళ్లు కూడా తనకు అండగా నిలవలేదని ఆరోపించింది. నటి ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Hindi
Actress
Junior Artist
Rape
Drugs

More Telugu News