'ఈ ఫొటోలోని వ్యక్తి కనపడుట లేదు' అంటూ గౌతం గంభీర్ గురించి పోస్టర్లు!
- ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
- కాలుష్యంపై పార్లమెంట్ ప్యానెల్ సమావేశానికి గౌతీ గైర్హాజరు
- ఇండోర్ వెళ్లి ఎంజాయ్ చేసిన గంభీర్
- 'ఈ ఫొటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూశారా?' అంటూ ఢిల్లీలో పోస్టర్లు
దీంతో ఈ రోజు ఢిల్లీలో 'గౌతం గంభీర్ కనపడుటలేదు' అంటూ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి సమీపంలో పలు చెట్లకు కొందరు ఈ పోస్టర్లు అంటించారు. ''కనపడుట లేదు.. మీరు ఈ ఫొటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూశారా? చివరి సారిగా ఇండోర్ లో అతడు తన స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనపడ్డాడు. ఢిల్లీ మొత్తం ఆయన కోసం వెతుకుతోంది'' అని ఆ పోస్టర్లలో ఉంది.