పాపమని కాపాడితే... బంజారాహిల్స్ పోలీసులపై దాడికి దిగిన యువతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాపమని కాపాడితే... బంజారాహిల్స్ పోలీసులపై దాడికి దిగిన యువతి!

  • రోడ్డుపై పడివున్న లీసా
  • స్టేషన్ కు తీసుకురాగా దాడి
  • రక్త పరీక్షలు చేయిస్తున్న పోలీసులు
మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె నానాయాగీ చేసింది. వివరాల్లోకి వెళితే, నిన్న రాత్రి లీసా అనే యువతి రోడ్డుపై పూటుగా మందుకొట్టి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆమెను స్టేషన్ కు చేర్చారు. తేరుకున్న ఆమె, పారిపోయేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అడ్డుకున్నారు.

ఎస్సైని బూతులు తిడుతూ, ఓ కానిస్టేబుల్ చేతిని కొరికిన లీసా, మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. ఆమెను గట్టిగా పట్టుకుని అదుపు చేసిన పోలీసులు, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, అంతు చూస్తానని బెదిరించింది. లీసా నాగాలాండ్ నుంచి వచ్చిందని, మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇక ఆమె డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో ఉండా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆపై ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
Lisa
Police
Hyderabad
Banjarahills
Drink

More Telugu News