Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు పటపటా నూరితే ముసలిపళ్లు ఊడిపోతాయి: వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు

  • నేను రాజీనామా చేస్తానన్నాను
  • లోకేశ్ ను విమర్శించాను
  • చంద్రబాబు తోక కత్తిరింపులు, బెదిరింపులు ఎప్పుడో చూశాం
టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ ను విమర్శించాను. వాళ్లకు ఇంకా ఆప్షన్ ఏముంది? చంద్రబాబునాయుడు ఇంకేమి చేయగలడు? పళ్లు పటపటా నూరతాడా? ముసలిపళ్లు ఊడిపోతాయి. ఇక్కడిదాకా సౌండొస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబునాయుడు? చంద్రబాబునాయుడు తోక కత్తిరింపులు, బెదిరింపులు, హూంకరింపులు, కాళ్లు పట్టుకోవడాలు ఎప్పుడో చూసేశాము. ఎలక్షన్ల ముందు మోదీ, అమిత్ షాను ఎన్ని తిట్టాడు? ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు?" అంటూ బాబును విమర్శించారు.
Chandrababu
Telugudesam
Vallabhaneni Vamsi
mla

More Telugu News