పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు ‘తెలుగు’ను ఉద్ధరిస్తారా?: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు
- పేదపిల్లలు ‘ఇంగ్లీషు’లో చదువుకుంటే ‘తెలుగు’ చచ్చిపోతుందంటారా?
- పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ అనేది చాలా ముఖ్యం
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు ‘తెలుగు’ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే ‘తెలుగు’ చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ అనేది చాలా ముఖ్యం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.