హాస్టల్ ఫీజు పెంపుపై నిరసన.. ఢిల్లీ జేఎన్ యూ వద్ద ఉద్రిక్తత... ఉపరాష్ట్రపతిని అడ్డుకునేందుకు ముందుకురికిన విద్యార్థులు
- హాస్టల్ ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల నిరసన
- వైస్ చాన్సలర్ సమాధానం చెప్పడంలేదంటూ ఆరోపణ
- జేఎన్యూ వద్ద పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ
ఓవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తుండగా ఆయన్ను అడ్డుకునేందుకు విద్యార్థులు ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిపై వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులు తమపై జులుం ప్రదర్శిస్తున్నారని జేఎన్యూ విద్యార్థులు వాపోయారు.