Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అబ్బాయి ఇంతకుముందే నటించాడు... కెమెరా కొత్త కాదు: గల్లా జయదేవ్

  • అశోక్ గల్లా హీరోగా తొలి సినిమా ప్రారంభం
  • రామానాయుడు స్టూడియోలో ముహూర్తం షాట్
  • అశోక్ గతంలో కృష్ణ, మహేశ్ చిత్రాల్లో నటించాడని వెల్లడించిన జయదేవ్
తెలుగు సినీ పరిశ్రమలో మరో కొత్త హీరో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్ కు రామ్ చరణ్ క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ, తన కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్నాడని, తమ సొంత బ్యానర్ అమర రాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు. తమ సొంత ప్రొడక్షన్ సంస్థను కొన్నాళ్ల కిందటే రిజిస్టర్ చేశామని, సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలు కూడా రూపొందిస్తామని చెప్పారు.

ఇక తన కుమారుడి గురించి చెబుతూ, అశోక్ కు ఇదే తొలి చిత్రం కాదని, ఇంతకుముందు, కృష్ణ, మహేశ్ బాబు సినిమాల్లో అశోక్ నటించాడని వెల్లడించారు. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడని, కెమెరా కొత్త కాదని పేర్కొన్నారు. అశోక్ సింగపూర్ లో చదువుకున్నాడని, టెక్సాస్ లో ఫిలిం అండ్ టెలివిజన్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడని గల్లా జయదేవ్ వివరించారు.
Galla Jaydev
Ashok Galla
Tollywood

More Telugu News