సంబరాలు ఉద్రిక్తతలకు తావివ్వకూడదు: వీహెచ్ పీ
- సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం
- 491 సంవత్సరాల పోరాటం తర్వాత దక్కిన విజయమిది
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పండగ చేసుకోవాల్సిన సందర్భమిది
సత్యం, న్యాయం పక్షాన కోర్టు నిలిచిందన్నారు. 40 రోజులు, 200 గంటలపాటు సుప్రీంకోర్టు విచారణ కొనసాగించి ఇచ్చిన తీర్పు ప్రపంచ న్యాయస్థానాల తీర్పుల్లోనే గొప్పదన్నారు. ఈ రోజు హిందువులు పండగ చేసుకోవాల్సిన సందర్భమన్నారు. ఇక్కడ ఒకరు గెలిచి, ఒకరు ఓడలేదన్నారు. సంబరాలు ఉద్రిక్తతలకు తావివ్వరాదని చెప్పారు. త్వరతగతిన కేంద్రం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.