సత్యమేవ జయతే... శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది: కన్నా
- అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుదితీర్పు
- సోషల్ మీడియాలో కన్నా స్పందన
- భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం అంటూ ట్వీట్
దశాబ్దాల తరబడి సాగిన వాదోపవాదాలను విన్న తర్వాత, సాక్ష్యాల పరిశీలన అనంతరం, సత్యశోధన జరిపిన పిదప సుప్రీం కోర్టు ఆమోదయోగ్యమైన తీర్పు వెలువరించిందని వ్యాఖ్యానించారు. ఇది గెలుపోటముల విషయం కాదని, దేశ ప్రజలందరూ ఒక్కటేనంటూ భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం అని పిలుపునిచ్చారు.