మెగా హీరో జోడీగా కైరా అద్వాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా హీరో జోడీగా కైరా అద్వాని

  • అందాల భామగా కైరా అద్వానికి క్రేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు
బాలీవుడ్ అందాల తారగా ప్రస్తుతం కైరా అద్వాని ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే,  'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఒక సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.
Varun Tej
Kiara Advani

More Telugu News