భారత మహిళా హాకీ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
- ఒలింపిక్స్ క్వాలిఫయర్ మ్యాచుల్లో మొత్తం 6 గోల్స్ చేసి అర్హత
- తొలి మ్యాచ్ లో భారత్ 5-1తో అమెరికాపై విజయం
- రెండో మ్యాచ్ లో 1-4 తేడాతో భారత్ ఓటమి
రెండో క్వాలిఫయర్ లో భారత్ ఒత్తిడికి లోనైంది. అమెరికా 4-0 గోల్స్ చేసి ఆధిక్యంలో ఉంది. భారత్ జట్టుకు ఓటమి ఖాయమైనప్పటికి.. ఒక గోల్ చేస్తే టోక్యో ఆశలు సజీవంగా ఉంటాయన్న పరిస్థితిని ఎదుర్కొంది. చివరి క్వార్టర్ లో కెప్టెన్ రాణి రాంపాల్ అద్భుతంగా గోల్ చేసి అమెరికా ఆధిక్యాన్ని 1-4 కు తగ్గించింది.