suicide: 'నాకు బతకాలని లేదు.. ఈ లోకంలో ఉండలేకపోతున్నా' అంటూ లేఖ రాసి, యువతి ఆత్మహత్య

  • కర్నూలు, సీతారాంనగర్‌లో ఘటన
  • కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా పని చేస్తోన్న యువతి
  • తన అక్క, అన్న, చెల్లెలికి తన మృతదేహాన్ని చూపొద్దని లేఖ
తనకు బతకాలని లేదని, ఈ లోకంలో ఉండలేకపోతున్నానని లేఖ రాసి శివ ప్రియాంక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని తన తండ్రి పడుతున్న బాధను చూడలేకపోతున్నానని పేర్కొంది. ఆమె గూడూరు మండలం జూలకల్‌లో కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా పని చేస్తూ కర్నూలులోని సీతారాంనగర్‌లో ఉంటోంది.

ఆమె తల్లిదండ్రులు  వీరభద్రుడు, లక్ష్మీదేవి పాణ్యంలో ఉంటారు. తాను ఉంటోన్న అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అమ్మను బాగా చూసుకోవాలని, తన అక్కను బావ బాగా చూసుకోవడం లేదని ఆమె ఆ లేఖలో తన తండ్రికి తెలిపింది. తాను చనిపోయాక తన మృతదేహాన్ని తన అక్క, అన్న, చెల్లెలికి చూపొద్దని, దయచేసి తన కోరిక తీర్చాలని ఆమె అందులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
suicide
Kurnool District

More Telugu News