రంగులు వేసుకోవడానికి తప్ప.. పాలించడానికి పనికిరాని పార్టీ వైసీపీ: కన్నా లక్ష్మీనారాయణ

  • 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారు
  • కార్మికులకు రూ. 150 కూలీ కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారు
  • ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి తప్ప... రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని ఆయన విమర్శించారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని... భవన కార్మికులకు రూ. 150 కూలీ కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని ట్వీట్ చేశారు. దీంతోపాటు, వివిధ కట్టడాలపై వైసీపీ రంగులు వేసిన ఫోటోలను షేర్ చేశారు. వీటిలో గ్రామ సచివాలయం, చేతి పంపు, శ్మశానం, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి.
Go Back to Shorts
Kanna
YSRCP
BJP

More Telugu News