సూపరో సూపర్... అమెరికన్ యువతుల దీపావళి స్టెప్పులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూపరో సూపర్... అమెరికన్ యువతుల దీపావళి స్టెప్పులు!

  • యూఎస్ ఎంబసీలో దీపావళి వేడుకలు
  • 'దిల్ బర్' పాటకు అమ్మాయిల డ్యాన్స్
  • వైరల్ అవుతున్న వీడియో
భారతీయులు అత్యంత సంప్రదాయ బద్ధంగా, ఉత్సాహంగా జరుపుకునే దీపావళి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ పండగ విశిష్టతను తమ ప్రాంతాల్లో తెలియజేస్తూ, భారత సంస్కృతిపై వారిలో మక్కువను పెంచుతున్నారు. ఇక ఈ దీపావళి సందర్భంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన వీడియోను యూఎస్ ఎంబసీ ఇండియా, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'సత్యమేవ జయతే' చిత్రంలోని 'దిల్ బర్' సాంగ్ కు కొందరు యూఎస్ అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో నృత్యం చేశారు. పాటకు అనుగుణంగా వారు నర్తిస్తుంటే, చుట్టూ ఉన్నవారు ఈలలు వేసి గోల చేస్తూ ఉత్సాహ పరిచారు. ఈ వీడియోను చూసిన వారంతా అమెరికన్ల డ్యాన్స్ సూపరంటున్నారు. వీడియోను మీరూ చూడండి.
Dewali
US Embassy
Dance

More Telugu News