అధిక ఉప్పు తీసుకుంటే బీపీయే కాదు.. 'డిమెన్షియా' ప్రమాదం కూడా!
- ఉప్పు మోతాదు మించితే మెదడులో నైట్రిక్ ఆక్సైడ్ లోపం
- మెదడులోని నాడీ కణాల పనితీరుపై ప్రభావం
- జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా
ఆహారంలో ఉప్పు మోతాదు మించడం వల్ల మెదడులో నైట్రిక్ ఆక్సైడ్ లోపం ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. దీంతో మెదడులోని నాడీ కణాల పనితీరుపై ప్రభావం పడుతుందని, జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియాకు దారితీస్తుందని వివరించారు. అంతేగాక, అల్జీమర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉప్పును మితంగానే తీసుకోవాలని సూచించారు.