Narendra Modi: వారణాసి అభివృద్ధి ఫలాలు పొరుగు రాష్ట్రాలకూ అందుతున్నాయి: ప్రధాని మోదీ

తాను ప్రధాని అయ్యే సమయానికి వారణాసిలోనూ ఎన్నో సమస్యలున్నాయని, ఓ ప్రజాప్రతినిధిగా వారణాసి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ కార్యకర్తల అకుంఠిత శ్రమ వారణాసి అభివృద్ధిలో ఎంతో కీలకమని కొనియాడారు.

వారణాసిలో చేస్తున్న అభివృద్ధి పనులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. వారణాసిలోని పండిత మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ ఆసుపత్రి, హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే కాదని బీహార్ వంటి పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఉపయుక్తంగా మారాయని అన్నారు. వారణాసిలో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రయోజనం కలిగిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు మోదీ జవాబిచ్చారు.
Narendra Modi
Varanasi
BJP

More Telugu News