నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్తులు

  • లేపాక్షి మండలం గలిబిపల్లి క్రాస్ వద్ద బాలయ్య వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
  • రోడ్డు పనులు పూర్తి కాలేదంటూ ఆవేదన
  • అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేయిస్తానన్న బాలయ్య
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని పరిణామం ఎదురైంది. లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురంకు వచ్చారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం వచ్చారు. బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కొడికొండ చెక్ పోస్టు నుంచి హిందూపురం వచ్చే దారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి సంవత్సరం కావొస్తోందని... ఇంత వరకు పనులు పూర్తి కాలేదని బాలయ్యతో గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన బాలయ్య... అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో, గ్రామస్తులు వెనక్కి తగ్గి, బాలయ్య వాహనానికి అడ్డు తొలిగారు.
Balakrishna
Telugudesam
Hindupuram

More Telugu News