దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న చురక

  • దరిద్రానికి బ్రాండ్ అంబాసడర్ మీ తుగ్లక్ ముఖ్యమంత్రి
  • గోదావరిలో 56 మంది అమాయకులను మింగేశారు
  • డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు
విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని ఏపీ ప్రభుత్వం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డుపై నిలబెట్టారని... డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ ను మూసివేసి పేదవాడి పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డీఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు విజయసాయిరెడ్డిగారు అంటూ ట్వీట్ చేశారు.

'దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ' అంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దరిద్రానికి బ్రాండ్ అంబాసడర్ మీ తుగ్లక్ ముఖ్యమంత్రి అని కొత్తగా చెప్పక్కర్లేదంటూ విమర్శించారు. మీరు అడుగుపెట్టాక రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసారెడ్డీ అంటూ ఎద్దేవా చేశారు. గోదావరిలో బోటును ముంచి 56 మంది అమాయకులను మింగేశారని... రాష్ట్రంలో 256 మంది రైతుల్ని మింగేశారని అన్నారు.
Go Back to Shorts
Budda Venkanna
Vijayasai Reddy
Jagan
Telugudesam
YSRCP

More Telugu News