మీరు ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: వైసీపీపై బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు
- ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేశారు
- పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ
- దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేశారు
'ఢిల్లీలో కూర్చొని కాళ్లు పట్టుకునే నీకు, అపాయింట్ మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ తుగ్లక్ జగన్ కి విశ్వసనీయత అంటే అర్థం తెలియదు శకుని మామా. మీ తప్పుల్ని చంద్రబాబు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?' అని ఎద్దేవా చేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే.