భార్య నాలుకను కోసేశాడు... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య నాలుకను కోసేశాడు... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • లిప్ కిస్ ఇస్తే, నాలుక ఇరుక్కుపోయిందన్న మన్సూర్
  • బాధితురాలికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
తన భార్య నాలుకను కోసేసిన ఓ వ్యక్తి, విచారణలో చెప్పిన సమాధానాలు విని పోలీసులే విస్తుపోవాల్సి వచ్చింది. తన నాలుక, తన భార్య నోట్లో ఇరుక్కుపోయిందని, చేసేదేమీ లేక, నాలుకను కత్తెరతో కట్ చేశానని అతను చెప్పాడు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌ కు చెందిన అయూబ్ మన్సూర్ (46), తన భార్య నాలుకను కత్తిరించాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రశ్నించగా, తాను భార్యతో కలిసున్న సమయంలో లిప్ లాక్ చేశానని, ఆమె నోటిలో తన నాలుక ఇరుక్కుపోగా, ఊపిరి అందలేదని, ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ పని చేశానని చెప్పాడు.

కాగా, మన్సూర్ కు బాధితురాలు మూడో భార్యని, మొదటి భార్యను హత్య చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడని, రెండో భార్య, అతని వైఖరి, వేధింపులను తట్టుకోలేక దూరంగా ఉందని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. బాధితురాలి నాలుకను, డాక్టర్లు ఆపరేషన్ ద్వారా తిరిగి అతికించారని, ఆమె ఆహారం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
Gujarath
Tongue
Police
Ahmadabad
Lip Lock

More Telugu News