ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

  • ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఓయూ విద్యార్థులు
  • ఎన్సీసీ గేట్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • స్వల్ప వాగ్వివాదం, తోపులాట
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన 'ప్రగతి భవన్ ముట్టడి' పిలుపు నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు, ఓయూ నుంచి ప్రగతి భవన్ కు విద్యార్థి సంఘాలు ర్యాలీగా బయలుదేరాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆ సంఘాల నేతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకొని, తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Telangana
tsrtc
ou
Hyderabad

More Telugu News