మధ్యప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న మాజీ సీఎం.. హేమమాలిని బుగ్గల్లా మారుస్తామన్న మంత్రి
- మధ్యప్రదేశ్లో రోడ్లపై రాజకీయం
- మాజీ సీఎం శివరాజ్ సింగ్ వ్యాఖ్యలకు మంత్రి పీసీ శర్మ కౌంటర్
- ప్రస్తుతం రోడ్లు కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయన్న మంత్రి
శివరాజ్ విమర్శలకు మంత్రి పీసీ శర్మ స్పందించారు. ఇప్పుడున్న రోడ్లు బాగానే ఉన్నాయని, భారీ వర్షాలు కురిస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుందని బదులిచ్చారు. వాషింగ్టన్లోని రోడ్లతో పోటీపడేలా నిర్మిస్తామన్న మంత్రి.. ప్రస్తుతం రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే 15 రోజుల్లోనే వాటికి మరమ్మతులు చేసి బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా మార్చేస్తామని అన్నారు.