ఇండస్ ఇండ్ బ్యాంకుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వీవీఎస్ లక్ష్మణ్
- బ్యాంకు సేవలు, కస్టమర్ కేర్ పై మండిపడ్డ లక్ష్మణ్
- వారికి బ్యాంకింగ్ ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవంటూ వ్యాఖ్య
- లక్ష్మణ్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని బ్యాంకు యాజమాన్యం
ఆ బ్యాంకు సిబ్బంది వచ్చి తమ బ్యాంకులో ఖాతాను ప్రారంభించాలని... అన్ని రకాల సేవలను అందిస్తామని మొదట్లో వాగ్దానం చేస్తారని... కానీ వారికి బ్యాంకింగ్ కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవని మండిపడ్డారు. వాస్తవానికి ఏం జరిగిందో ఆయన వెల్లడించనప్పటికీ... బ్యాంకు తీరుతో ఆయన చాలా విసిగిపోయారనే విషయం మాత్రం అర్థమవుతోంది. లక్ష్మణ్ వ్యాఖ్యలపై బ్యాంకు యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది.