ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వానికి ఓకే: కె.కేశవరావు
- ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటి వరకు నన్ను పిలవలేదు
- ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా నన్ను కలవలేదు
- కార్మికుల డిమాండ్లపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాను
అయితే, ఒకవేళ కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తే తాను ఆర్టీసీ నేతలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు మధ్యవర్తిగా ఉంటానని కేశవరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై పునరాలోచించాలని తాను ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. కాగా, కేశవరావు మధ్యవర్తిత్వం చేస్తే మంచిదేనని, తాము చర్చలకు వస్తామని నిన్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.