Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్క మాట.. సినిమా అంటే ఇది!: ‘సైరా’ సక్సెస్ మీట్ లో నటుడు సాయిచంద్

  • ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర దొరికిందనుకున్నా
  • కానీ, ఇంత మంచి పాత్ర అని ఊహించలేదు
  • చిరంజీవికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా నా రుణం తీరదేమో!
ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సంతోషంలో ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ‘సక్సెస్ మీట్’ నిర్వహించారు. హీరో చిరంజీవి, నటులు సాయిచంద్, రవి కిషన్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, దర్శకుడు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయిచంద్ మాట్లాడుతూ, ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర వేస్తున్నానని అనుకున్నాను కానీ, ఇంత మంచి పాత్ర పోషిస్తున్నానని, ఆ పాత్రకు ఇంత స్పందన ఉంటుందని అప్పుడు ఊహించలేదని చెప్పారు. ‘చిరంజీవి గారూ, కొన్ని వేల కోట్ల కృతజ్ఞతలు మీకు చెప్పినా కూడా నా రుణం తీరదేమో’ అని చెప్పిన సాయిచంద్, ‘తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కమాట.. సినిమా అంటే ఇది!’ అంటూ నవ్వులు చిందించారు.

అటువంటి పాత్ర నాకు ఇచ్చారు


దర్శకుడు సురేందర్ రెడ్డి తన చిత్రం ‘కిక్’లోని ఓ డైలాగ్ ను ఈ సందర్భంగా సాయిచంద్ ప్రస్తావించారు. ‘‘జీవితంలో ఓ కిక్ ఉండాలి’ అని మీరు (సురేందర్ రెడ్డి) ‘కిక్’ లో చెబుతారు కదా, అటువంటి పాత్ర మీరు నాకు ఇచ్చారు.. థ్యాంక్స్’ అని తన సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ‘సైరా’ చిత్రంలో సాయిచంద్.. సుబ్బయ్య పాత్రలో నటించారు.
Sye Raa Narasimha Reddy
Chiranjeevi
saichand

More Telugu News