యురేనియం తవ్వకాల ప్రాంతాలలో గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి: జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

  • యురేనియం తవ్వకాలను వెంటనే ఆపేయాలి
  • ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు
  • తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించాలి
ఏపీలో జరుగుతున్న యురేనియం తవ్వకాలపై భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తవ్వకాలను వెంటనే ఆపాలని ప్రజలు, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించిందని లేఖలో తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని... గర్భిణులకు గర్భస్రావాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని విన్నవించారు.

Go Back to Shorts
CPI Ramakrishna
Jagan
YSRCP

More Telugu News