టీఎస్సార్టీసీ సమ్మె.. హౌస్ మోషన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు
- ఈ నెల 10కి తదుపరి విచారణ వాయిదా
- వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలన్న హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని టీ-సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు
తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీ-సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.