Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాళ్ల తడాఖా

  • వన్డే ఆటగాళ్ల ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
  • బ్యాటింగ్ లో నెంబర్ వన్ ప్లేసు పదిలపర్చుకున్న కోహ్లీ
  • బౌలింగ్ టాప్ ర్యాంకులో బుమ్రా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా టాపర్ గా నిలిచాడు. బ్యాటింగ్ లో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ కోహ్లీని వెన్నంటే ఉన్నాడు. రోహిత్ రెండో ర్యాంకులో నిలిచాడు. బౌలింగ్ లో బుమ్రా తర్వాత న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, సఫారీ స్పీడ్ స్టర్ కగిసో రబాడా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ICC
Rankings
Virat Kohli
Bumrah
ODI

More Telugu News