సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రూటు మారుస్తున్న సమంత 
  • గోపీచంద్ సినిమాకు మంచి బిజినెస్ 
  • హిందీలోకి పూరి 'ఇస్మార్ట్ శంకర్'
*  అందాలతార సమంత ప్రస్తుతం వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ కు మంచి ఆదరణ రావడంతో, దీనికి మరో ఎడిషన్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సమంత నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రస్తుతం సమంతతో సంప్రదింపులు జరుగుతున్నాయట.
 *  గోపీచంద్ హీరోగా రూపొందిన 'చాణక్య' చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. చిత్రం పట్ల అంచనాలు బాగా ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ క్రమంలో నాన్ థియేట్రికల్ హక్కుల రూపేణా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు 'స్టార్ మా' ఛానెల్ కు 4 కోట్లకు, హిందీ అనువాద హక్కులు 9 కోట్లకు అమ్ముడుపోగా, డిజిటల్ హక్కులను 2 కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.
*  రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తాడట.
Samantha
Gopichand
Ram
Puri Jagannadh

More Telugu News