లా విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు.. ఆసుపత్రి నుంచి జైలుకు బీజేపీ నేత చిన్మయానంద
- 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
- ఆ వెంటనే చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన చిన్మయానంద
- బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ
సోమవారం ఆయన కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు అటునుంచి అటే ఆయనను జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో చిన్మయానందకు బెయిలు ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ జిల్లా కోర్టు నిరాకరించింది. మరోవైపు, డబ్బుల కోసం చిన్మయానందను బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలపై బాధితురాలైన న్యాయ విద్యార్థినిపైనా కేసు నమోదైంది. విద్యార్థినికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు..బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది.