Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాము విసిరిన లంగరుకు బరువైన వస్తువు తగిలిందంటున్న ధర్మాడి సత్యం బృందం

  • గోదావరిలో బోటు మునక
  • పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు
  • బోటు వెలికితీత పనులు కొనసాగిస్తున్న బాలాజీ మెరైన్స్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో కొన్నిరోజుల కిందట బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, మరికొందరి ఆచూకీ నేటికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో, మునిగిపోయిన బోటును వెలికితీస్తే మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ ఈ వెలికితీత కార్యక్రమం నిర్వహిస్తోంది. బాలాజీ మెరైన్స్ అధినేత ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, ధర్మాడి సత్యం బృందం విసిరిన పలు యాంకర్లలో ఓ దానికి బరువైన వస్తువు తగిలినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ లంగరుకు అనుసంధానించిన రోప్ ను పొక్లెయిన్ సాయంతో బయటికి లాగుతున్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘమైనది కావడంతో యాంకర్ కు తగిలిన వస్తువు ఏంటన్నది తెలియడానికి మరికాస్త సమయం పట్టనుంది.

ఈ వెలికితీత కార్యక్రమంలో ప్రస్తుతం రెండు పంట్లు, రెండు యాంకర్లు ఉపయోగిస్తున్నారు. ఒడ్డున కొన్ని పొక్లెయిన్లను సిద్ధంగా ఉంచారు. కాగా, బోటు వెలికితీత పనులు కొనసాగుతున్న ప్రాంతంలో ధర్మాడి బృందాన్ని తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించడంలేదు.

Godavari
East Godavari District
Boat

More Telugu News