మూడు నెలలుగా తిండి కూడా పెట్టడం లేదు: లాలూ ప్రసాద్ కోడలు ఐశ్వర్య
- తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదు
- పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నా
- మీసాభారతి వల్లే సమస్య పెద్దది అయింది
తన అత్తింటివారు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదికి తాళాలు వేస్తున్నారని, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇంట్లో నెలకొన్న పరిస్థితిని వీడియో తీస్తుంటే రబ్రీదేవి బాడీ గార్డ్ వచ్చి తన ఫోన్ లాక్కున్నారని చెప్పారు. తనను తన భర్త, మరిది ఇబ్బంది పెట్టడం లేదని... ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదయిందని మండిపడ్డారు. మూడు నెలలుగా పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపునింపుకుంటున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రికా రాయ్ తో కలసి లాలూ అవుట్ హౌస్ లో ఆమె ధర్నాకు దిగారు. దీనికి తోడు ఆమె మహిళా హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.